– మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: టెక్నాలజీతో బౌగోళిక, ఆర్ధిక, రాజకీయ మార్పుకు అనుగుణంగా బయో ఆసియా -2026 సదస్సు విజన్ ఉందని, పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బయో ఏసియా సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఏఐ టెక్నాలజీ వినియోగించుకుని ముందుకు వెళ్ళాలన్నారు. హెల్త్ కేర్ ప్రజలకు సరసమైన ధరలతో అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 25 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ లక్ష్యమని తెలిపారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామంటూ రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న నోవార్టిస్ కంపెనీని సీఎం అభినందించారన్నారు. ఒపెల్లా.. ఫ్రాన్స్‌కు చెందిన గ్లోబల్ హెల్త్ కేర్ కంపెనీ పెట్టుబడులతో ముందుకువచ్చిందని, యూఎస్‌కు చెందిన ట్రిడెంట్ ఏఐ కంపెనీ రూ.300 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుందని, ఆరఎక్స్ ప్రొపెల్లంట్ రూ.1000 కోట్ల పెట్టుబడులు ఇలా చాలా కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయంటూ ఇది రాష్ట్రానికి శుభ సంకేతం అని అన్నారు. ఈ పెట్టుబడులు ఇక్కడ ఉపాధి అవకాశాలను ఎంతో పెంచుతాయని చెప్పారు. ఈ మార్పులÅ£నుగుణంగా లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో మెరుగైన టెక్నాలజీని ఉపయోగించుకుంటామన్నారు. హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‌గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జినోమ్ వ్యాలీ ఫేజ్ 4ను వంద ఎకరాలతో విస్తరించబోతున్నామని, అత్యాధునిక మౌలిక వసతులతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2035 నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లైఫ్ సైన్సెస్ రంగంలో ఆకర్షించేందుకు ప్రణాళిక రూపొందించామని, కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించే లక్ష్యమని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణను ప్రపంచంలోని టాప్-3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలపడం తమ లక్ష్యమన్నారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి ఆధునిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ, తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా రెడీ టు వర్క్, వర్క్‌ఫోర్సు తయారీలో సీబీఆరఐ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్-2025 ప్రకారం గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిందని తెలిపారు. హైదరాబాద్ ఉత్పత్తి మాత్రమే కాకుండా కొత్త ఔషధాల పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందిందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




