– ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
నాగర్‌కర్నూల్,ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోరం జరిగింది. తన ముగ్గురు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతక తండ్రి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి కుమార్తెలు మోక్షిత (8), వర్షిణి (6), శివధ(4) ఉన్నారు. భార్యతో కలహాల నేపథ్యంలో గత నెల 30న కుమార్తెలు, కుమారుడిని తీసుకుని వెంకటేశ్వర్లు శ్రీశైలం వెళ్లాడు. అక్కడి నుంచి అదేరోజు రాత్రి పిల్లలను తీసుకుని నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్‌కు వెళ్లాడు. 31న ఉప్పునుంతల మండలం సూర్యతండా సపంలో చిన్నకుమార్తె వర్షిణి, కుమారుడు శివధర్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సపంలో పెద్దకుమార్తె మోక్షితను కూడా అదే తరహాలో చంపేశాడు. అనంతరం కల్వకుర్తి పట్టణానికి వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి తాగాడు. వెల్దండ మండలం పెద్దాపుర్ శివారు బూరకుంట వద్ద బుధవారం ఉదయం వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యమైంది. వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యం కావడంతో అతడి సోదరుడు మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్-శ్రీశైలం జాతీయరహదారికి ఇరువైపులా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగించాయి. ఈ క్రమంలో కాలిపోయిన స్థితిలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





