వనస్థలిపురంలో దారుణం

– మాజీ భార్యను హత్య చేసిన ప్ర‌బుద్ధుడు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18 : హైదరాబాద్‌ ‌వనస్థలిపురం గ్రీన్‌ ‌సిటీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేష్‌ అత్యంత కిరాతకంగా హత్య చేయడం కలకలానికి  గురిచేసింది. సునీత కొన్ని రోజుల క్రితమే మహేష్‌కు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. దీంతో ఆమెను చంపేందుకు మాజీ భర్త ప్లాన్‌ ‌వేశాడు. రెండు కత్తులు, పెట్రోల్‌ ‌డబ్బాతో సునీత ఇంట్లోకి మహేష్‌ ‌చొరబడ్డాడు. ముందుగా ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కత్తులతో తీవ్రంగా గాయపరిచాడు. పూల కుండీతో తలపై బలంగా మోది హత్య చేశాడు. సునీత రక్తపు మడుగులో పడి ఉండగా మహేష్‌ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కొద్ది గంటల్లోనే మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకోవడాన్ని సహించలేకపోయిన మహేష్‌ ఈ ‌హత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *