– రియల్ వ్యాపారి జునైద్‌గా గుర్తింపు
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబరు4: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి కత్తి పోట్లతో పడి ఉన్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితుడిని హుటాహుటిన సంతోష్‌నగర్‌లోని యశోదా హాస్పిటల్‌కి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు పాతబస్తీ రెయిన్ బజార్‌కు చెందిన మహమ్మద్ జునైద్ (30)గా గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జునైద్‌ను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచారని.. తీవ్రంగా గాయపడిన జువైద్‌ను హాస్పిటల్‌కి తరలించగా.. పరిస్థితి విషమించి మృతిచెందాడని పోలీసులు తెలిపారు. అనంతరం జునైద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే నిందితులు, బాధితుడు ఇద్దరూ కూడా బంధువులే అని అసిస్టెంట్ కమిషనర్ శ్యామ్ సుందర్ తెలిపారు. జువైద్‌ను ఎందుకు హత్య చేశారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.