– ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు
– పనికి పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న కమిషనర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్13: నగరంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రాంచీలో పట్టుకున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి మీడియాకు వివరించారు. హత్య అనంతరం నిందితులు క్యాబ్‌లో రాంచీకి పరారైనట్లు చెప్పారు. హఫీజ్‌పేట నుంచి సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైలులో రాంచీకి వెళ్దామనుకున్నారనీ.. అయితే అక్కడ పోలీసుల కదిలికలు చూసి క్యాబ్ తీసుకుని పరారయ్యారని వివరిం చారు. ఈ హత్యక్రమంలో సిపి పలు సూచ నలు చేశారు. ఇంట్లో ఎవరినైనా ఇంట్లో పనికి పెట్టుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. వారి నేపథ్యం గురించి ఆరా తీయాలని పేర్కొ న్నారు. మొత్తం 7 తులాల బంగా రాన్ని ఎత్తుకెళ్లారని చెప్పారు. రోల్డ్ గోల్డ్ నగలు చూసి ఇంట్లో భారీగా బంగారం ఉందని నిందితులు భావించారని తెలిపారు. కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో వంట మని షిగా పనిచేస్తున్న యువకుడు.. మరొకరు కలిసి ఆమెను చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి.. చిత్రహింసలు పెడుతూ.. తలపై కుక్కర్‌తో కొట్టి హత్య చేశారు. నగదు, బంగారం దోచుకెళ్లారు. హత్య చేశాక.. అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి.. యజ మానికి చెందిన ద్విచక్ర వాహ నంపైనే పరారయ్యారు. కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయ ంత్రం ఈ దారుణం చోటుచే సుకుంది. దీనిని సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




