భార్యాభర్తల మధ్య గొడవలు

– మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మామను అల్లుడు కత్తితో పొడిచి చంపండం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని అన్‌పూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధి బీరంగూడ కమాన్‌ ‌సపంలో నివాసముండే చంద్రయ్య (58)ను అల్లుడు రామకృష్ణ కత్తితో పొడిచి హతమార్చాడు. రామకృష్ణకు భార్యకు మధ్య మనస్పర్ధలు రావడంతో గత మూడు నెలలుగా భార్య తల్లి గారి ఇంటి వద్ద ఉంటున్నది. గురువారం సాయంత్రం చంద్రయ్య ఇంటికి రామకృష్ణ వచ్చి భార్యతో గొడవ పడుతుండగా చంద్రయ్య వారిని వారించాడు. ఆగ్రహానికి గురైన రామకృష్ణ అంతు చూస్తానని ఇంటికి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి చంద్రయ్యను పొడిచి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *