– అధికారులను సన్నద్దం చేసిన కమిషనర్
- కలెక్టర్లు, అఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్
- వోటర్ల జాబితాల సవరణ, అభ్యంతరాలపై షెడ్యూల్
– ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి7: ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల పక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, టైమ్‌లైన్స్‌పై కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని చర్చ సాగుతోంది. ఈ క్రమంలో తాజా ఆదేశాల మేరకు ఈనెల 12లోగా వోటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆయా అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. 13న టీ పోల్ యాప్‌లో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా అప్‌లోడ్ చేయాలని, 16న పోలింగ్ స్టేషన్ల వారీగా.ఫొటోలతో కూడిన తుది వోటర్ల జాబితా ప్రచురించాలని సూచించింది. బ్యాలెట్ బాక్సులు, అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు ఎస్‌ఈసీ ఆదేశించింది. ఇక 2019 నాటి వోటర్ల జాబితానే ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
పోలింగ్ స్టేషన్లలో బీఎల్‌వోల ద్వారా వోటర్ల వివరాలను పరిశీలన చేయాలని సూచించింది. ఆన్‌లైన్‌లో కూడా వోటరు నమోదు, మార్పులకు అవకాశమిచ్చిందని వివరించింది. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. 12 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, 13 వరకు అభ్యంతరాల పరిశీలన ప్రారంభం, 16న వోటరు జాబితా విడుదల చేయాలని ఆదేశం ఇచ్చారు. సమావేశంలో భాగంగా కలెక్టర్లకు ముఖ్యంగా వోటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాల ప్రచురణపై డెడ్‌లైన్లు నిర్దేశించారు. 12 నాటికి తుది వోటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. 13నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలతో కూడిన ముసాయిదా జాబితాను విడుదల చేసి, వెంటనే టీ పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇక 16వ తేదీ లోపు పోలింగ్ స్టేషన్ల పూర్తి వివరాలతో పాటు ఫోటోలతో కూడిన తుది జాబితా, తుది వోటర్ల జాబితాను వార్డు పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ చర్య ద్వారా వోటర్లకు తమ పోలింగ్ కేంద్రం, వివరాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఈసీ పేర్కొంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులపై కూడా ఈసీ కలెక్టర్లకు దిశానిర్దేశర చేసింది. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సిబ్బంది నియామకం, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్/సర్వైలెన్స్ స్క్వాడ్స్ను నియమించి, ఎన్నికల పక్రియను పర్యవేక్షించాలని కమిషన్ సూచించింది. కలెక్టర్లు ఈ డెడ్‌లైన్లను కచ్చితంగా పాటిస్తూ, అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలనే లక్ష్యంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





