ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఘట్టం

– భారీగా  నామినేషన్లు వేసిన అభ్యర్థులు
– సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి
– గజ్వెల్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన ఎంపి రఘునందన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ల దాఖలుకు గడువు ముగియగా.. అప్పటికే క్యూలైన్‌లలో ఉన్నవారు నామినేషన్‌లు వేసేందుకు అనుమతించారు. శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.  నామినేషన్‌ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు విధించారు. కాగా ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫిర్యాదులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ’టీఈ పోల్‌’ మొబైల్ యాప్ ఏర్పాటు చేసింది. వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పించినట్టు ఎసఈసీ తెలిపింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ గడువు మగియగా.. అప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న వారిని నామినేషన్ వేసేందుకు అనుమతించారు. శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.అదే రోజు  అభ్యర్థులకు ఈసీ గుర్తులు కేటాయిస్తుంది.   మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి  3 వరకు విత్ డ్రాలు నిర్వహించి అదే రోజు అభ్యర్థులకు  గుర్తులను కేటాయిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుంది. అంటే వచ్చే ఫిబ్రవరి 9వ తేదీన ప్రచారం బంద్ అవుతుంది. ఈ లెక్కన అభ్యర్థులు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది.
చివరిరోజు గజ్వెల్‌లో బిజెపి అభ్యర్థి నామినేషన్‌లో మెదక్ ఎంపి రఘునందన్ రావు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *