మున్నేరు వరదలో చిక్కుకున్న అయిదుగురు

– ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కాపాడిన అధికారులు

చింతకాని, ప్రజాతంత్ర, జులై 24: మండలంలోని చిన్న మండవ గ్రామానికి చెందిన అయిదుగురు వ్యక్తులు గేదెలు మేపుకోవడానికి వెళ్లి అకస్మాత్తుగా పెరిగిన మున్నేరు వరదలో చిక్కుకున్నారు. అయితే పార్టీ అగ్రనాయకులకు కుల గణన సర్వే ప్రెజంటేషన్‌ పనిపై దిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఈ సమాచారం అందింది. దాంతో వారిని కాపాడాలంటూ ఆయన ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. వెంటనే రెవెన్యూ, పోలీస్‌ అధికారులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి వరదలో చిక్కున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఐదుగురు సురక్షితంగా రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. అత్యంత ముఖ్యమైన పనిలో ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం తపన చెందిన భట్టి విక్రమార్కకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *