మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు

– ఎన్నికల సంఘానికి అందనున్న రిజర్వేషన్ల జాబితా
– ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల పక్రియలో కీలక ముందడుగు పడిరది. పది మున్సిపల్‌ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. శనివారం సాయంత్రానికి మున్సిపల్‌ వార్డులు, కార్పొరేషన్‌ డివిజన్ల రిజర్వేషన్ల పక్రియ పూర్తి కానుంది. రాత్రికి లేదా ఆదివారం ఉదయానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా అందజేసే అవకాశం ఉంది. ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లోనే మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. 10 కార్పొరేషన్లలో ఎస్సీ`1, ఎస్టీ`1, బీసీ`3(ఒకటి మహిళ)లకు కేటాయించారు. జనరల్‌ కేటగిరీలో ఐదు స్థానాలకు గాను నాలుగు స్థానాలను మహిళలకు కేటాయించారు. 121 మున్సిపాలిటీల్లో ఎస్సీ`17, ఎస్టీ`5, బీసీ`38, జనరల్‌`61 కేటాయించింది. కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం-ఎస్టీ (జనరల్‌), రామగుండం – ఎస్సీ (జనరల్‌), మహబూబ్‌నగర్‌ ` బీసీ మహిళ, మంచిర్యాల` బీసీ (జనరల్‌), కరీంనగర్‌` బీసీ (జనరల్‌), ఖమ్మం` మహిళ(జనరల్‌), నిజామాబాద్‌` మహిళ (జనరల్‌), వరంగల్‌` జనరల్‌, నల్లగొండ` మహిళ (జనరల్‌), జీహెచ్‌ఎంసీ` మహిళ (జనరల్‌)కు కేటాయించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *