హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: జీహెచ్‌ఎంసీ విస్తరణకు కీలకమైన ‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్’పై గవర్నర్ ఆమోదం తెలిపారు.ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గెజిట్ విడుదల చేయనుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించే తీర్మానం చేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాకు ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల, బయట ఉన్న 27 పురపాలక సంస్థలను జీహెచ్‌ఎంసీ పరిధిలో చేర్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలలో సవరణలు చేయాలని కూడా నిర్ణయించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




