– నెలాఖరులో నోటిఫికేషన్ ఛాన్స్
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శుక్రవారం చిట్‌చాట్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ నేతల వ్యవహార శైలి చూస్తున్నామని వారి పంతం నెగ్గించుకోవడానికి ఏమైనా చేస్తారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ముఖం బీఆర్‌ఎస్ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. తమ తప్పు ఉంటే అసెంబ్లీలో నిరూపించాలని సవాల్ విసిరారు. మూసీ అంశంలో బీఆర్‌ఎస్ నేతలే రన్నింగ్ కామెంటరీ చేశారని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ ప్రభావం కోల్పోయిందని.. ఉనికి కాపాడుకోవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పేదవారి పథకం గురించి బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులకు వేడి నీటిని అందించడానికి సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఇందుకోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కనీసం గౌరవం ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



