ఖానాపూర్‌ ‌మున్సిపల్‌ ఎన్నిక వాయిదా

– చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం
– జోగు  రామన్న హౌజ్‌ అరెస్ట్

‌నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4:‌ ఖానాపూర్‌ ‌ఛైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ‌కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో నిర్మల్‌ ‌జిల్లా ఖానాపూర్‌ ‌మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్‌ ‌కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మున్సిపల్‌ ‌కార్యాలయం ఎదుట భాజపా, బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులను ఆయన బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. ఇలావుంటే చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జోగు రామన్నను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌లోని ఆయ‌న‌ ఇంటికి వెళ్లిన పోలీసులు హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ సీఎం రేవంత్‌ ‌రెడ్డి హోంశాఖను తన అధీనంలో ఉంచుకొని ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు చేయించి జైలుకు పంపడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేసి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికార దాహంతో బీఆర్‌ఎస్‌ ‌నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజస్వామికమని మండిపడ్డారు. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నిక బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారడంతో కుట్రపూరిత చర్యలకు దిగజారడం శోచనీయమని ఆరోపించారు. రాజ్యాంగ‌ నియమాలను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికలు పోలీసుల పహారా మధ్య వారికి అనుగుణంగా మార్చుకునే కుతంత్రాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి గట్టి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *