– వైస్ చైర్‌పర్సన్‌గా ఆసియా షాహిన్
– అందరికీ అవకాశాలు వస్తాయి.. నిరుత్సాహపడొద్దు
– వెన్నుపోటు రాజకీయాల వల్లే నాలుగు స్థానాల్లో ఓడాం
– కాంగ్రెస్ కౌన్సిలర్లను సత్కరించి అభినందించిన మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్నీ ఆలోచించి ములుగు మున్సిపల్ చైర్ పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళ భిక్షపతిని ఎంపిక చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక సోమవారం జరిగింది. చైర్‌పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్‌గా ఆసియా షాహిన్ ఎన్నికయ్యారు. పురపాలక సంఘం అధీకృత అధికారి అయిన రాజస్వ మండల అధికారి ఎన్.వెంకటేష్ ఈ ఎన్నిక నిర్వహించగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీవో వెంకటేష్ 20మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. 6వ వార్డు కౌన్సిలర్ చంద్రకళ చైర్‌పర్సన్‌గా, 14వ వార్డు కౌన్సిలర్ ఆసియా వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో మెంబర్‌గా మంత్రి దనసరి అనసూయ సీతక్క ఈ కార్యకమ్రానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు గంగాధర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అందరికీ చైర్మన్ కావాలని ఉంటుంది.. కానీ ఎవరో ఒకరికే అవకాశం దక్కుతుందన్నారు. సీనియర్, అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి పార్టీ ములుగు టౌన్ ప్రెసిడెంట్ చింతనిప్పుల భిక్షపతికి అవకాశం ఇచ్చామన్నారు.
నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు
అవకాశాలు రానివారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్తులో అందరికీ మంచి అవకాశాలు వస్తాయి అని సర్దిచెప్పారు. వెన్నుపోటు రాజకీయాల వల్లే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారంటూ పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరమని, వెన్నుపోటు రాజకీయాలు చేసినవారు పద్ధతి మార్చుకోవాలి.. ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన కార్యకర్తలు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తనపై గతంలో ఎన్ని ఒత్తిడిలు వచ్చినా భిక్షపతి పార్టీ మారలేదని, ఆయనలో చిత్తశుద్ధి ఉంది.. కమిట్మెంట్‌తో పనిచేశాడు.. పార్టీ కార్యకర్తల అభీóష్టం మేరకు అవకాశం ఇచ్చాము అని మంత్రి చెప్పారు. మున్సిపాలి{లో¡ సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి భిక్షపతి అన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల కుమార్ అన్నలాంటివారు.. ఆయన కుమారుడు భరత్‌కు ఇంకా చాలా వయసు ఉంది.. మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పారు. మనల్ని ఓడగొట్టేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా పనిచేసిందంటూ కోట్లు కుమ్మరించినా ప్రజలు మనకే పట్టం కట్టారన్నారు. తనకు నాకు ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు.. అందరూ నాకు సమానమే.. కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తేనే విజయం వరించిందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





