కాంగ్రెస్ గెలుపునకు బహుముఖ వ్యూహం

– చెన్నైలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

చెన్నై, ఏప్రిల్ 11: తమిళనాడులో ఈనెల 23న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించి ఎన్నికల బరిలో విజయం సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, ఒకమారు లోక్£సభ సభ్యుడిగా ఎన్నికకావడంతోపాటు పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు పార్టీ ఎన్నికల సీనియర్ పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్‌గా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. అందులో భాగంగా శనివారం చెన్నై కేంద్రంలో నియోజకవర్గస్థాయి పార్టీ పరిశీలకులతో ఉత్తమ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచార వ్యూహం, సమన్వయంతోపాటు పార్టీ సంస్థాగత పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై తనతోపాటు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ముఖుల్ వాస్నిక్, ఖాజా మోహినోద్దీన్‌లతో కలిసి సమీక్షించినట్లు చెప్పారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి అవసరమైన మార్గదర్శనం గురుంచి నియోజకవర్గ స్థాయి పరిశీలకులతో చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గ పార్టీ యంత్రాంగాన్ని రాష్ట్ర స్థాయి నాయకత్వంతో సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *