42శాతం రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

– రేవంత్‌కు ఎంపీ ఆర్‌. ‌కృష్ణయ్య లేఖ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.‌కృష్ణయ్య లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీ భవన్‌లో ఆయన వివరించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల ముందు చేసిన కామారెడ్డి డిక్లరేషన్‌ ‌ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఇటీవల జరిగిన సర్పంచి ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు చేసిన తర్వాత నిర్వహించాలని కోరారు. అలా చేయకుండా ఎన్నికలకు వెళితే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున పెద్దఎత్తున బీసీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 ‌డిసి ప్రకారం స్థానిక సంస్థలలోని బీసీ రిజర్వేషన్‌ ‌పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. బీసీలకు ఇచ్చిన హాని సీఎం అమలు చేసి మాట నిలుపుకోవాలని, లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *