న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించినందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని పార్లమెంటులో కలిసి అభినందించారు. అలాగే సమ్మిట్ సందర్భంగా రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చిన నేపథ్యంలో వారందరూ కలిసి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, సురేష్ షెట్కార్, డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. సీఎం వెంట కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





