పూలే ఆశయాలకు ప్రతిరూపం మోదీ పాలన

– మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవ శకానికి నాంది
– బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: నాడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఏ సామాజిక మార్పు కోసం పరితపించారో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ఆశయాలను అక్షరాలా అమలు చేస్తూ మహిళల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని బీజేపీ¾ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఫూలే జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూల మాల అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఫూలే దార్శనికతతోనే మహిళా విద్యకు పునాది పడిందని గుర్తు చేశారు. సమాజంలో మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు వెళ్తుందనే బలమైన నమ్మకంతో అంటరానితనం, స్త్రీలపై ఉన్న సామాజిక కట్టుబాట్లను ఎదిరించి తన సతీమణి సావిత్రిబాయి ఫూలేకు విద్యను అందించి 1848లోనే బాలికల కోసం దేశంలో తొలి పాఠశాలను స్థాపించిన ఘనత జ్యోతిబా పూలేకు చెందుతుందని పేర్కొన్నారు. ఫూలే కలలను సాకారం చేస్తూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ‘నారీశక్తి వందన్ అధినియమ్‌’ను మోదీ ప్రభుత్వం తీసుకురావడం చరిత్రాత్మకమని లక్ష్మణ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా ఇందులో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా నిజమైన సామాజిక న్యాయాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. 1996 నుండి 2010 వరకు అనేకసార్లు మహిళా బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ, ఆర్జేడీ వంటి పార్టీల అడ్డంకుల వల్ల బిల్లు ముందుకు సాగలేదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా మాతృభాషలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆడపిల్లలకు సైనిక్ స్కూల్స్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో అవకాశాలు కల్పించడం మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న స్పష్టమైన ఉదాహరణలని వివరించారు. అదే సమయంలో ముద్ర రుణాలు, లఖ్‌పతి దీదీ, నమో డ్రోన్ దీదీ వంటి పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారు ఉద్యోగాల్లోనే కాÅ£ పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదగడానికి ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు గణనీయ ప్రాతినిధ్యం కల్పించడం వంటివన్నీ సామాజిక న్యాయానికి నిదర్శనాలని ఆయన స్పష్టం చేశారు. ‘బేటీ బచావో – బేటీ పడావో’ ద్వారా లింగ నిష్పత్తి మెరుగుపడగా ‘సుకన్య సమృద్ధి యోజన’ ద్వారా 4.2 కోట్లకు పైగా బాలికలకు ఆర్థిక భద్రత కల్పించినట్లు లక్ష్మణ్ చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *