కష్టాల్లో ఉన్న ప్రజలకు బీజేపీ బాసట

– వరద బాధితులకు ఎంపీ లాడ్స్‌నుంచి తక్షణ సాయం
– ఎంపీల సహకారానికి ధన్యవాదాలు: అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వారిని ఆదుకునేందుకు రాష్ట్రంలోని ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తమ ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున కేటాయించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి సహకారం అందించిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసినందున బీజేపీ ఎంపీలు తక్షణమే ముందుకు వచ్చి సహాయక చర్యల కోసం నిధులను కేటాయించడం ముదావహమన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడల్లా బీజేపీ ఆదుకుంటోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తమ పార్టీ ప్రజా హితం కోసం పనిచేస్తున్నదన్నారు. ప్రజల పక్షాన నిలబడేది బీజేపీ మాత్రమే అన్నది మరోసారి రుజువైందని ఆయన అన్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉండటం, సహాయక చర్యల్లో పాల్గొనడం బీజేపీ బాధ్యత అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *