ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

– కామారెడ్డి ఎమ్మెల్యే పరామర్శకు బయల్దేరుతుండగా..
– ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటి మీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు బ‌య‌ల్దేరుతున్న‌ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఫోన్‌లో ఆయనను పరామర్శించి కామారెడ్డికి ఈటల బ‌య‌ల్దేర‌బోతుండ‌గా ఏసీపీ సహా పెద్దఎత్తున పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రభుత్వ వైఖరిని, పోలీసుల తీరును ఎంపీ ఈటల తీవంగ్రా ఖండించారు. గూండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేసింది.. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ప్రజలు సహించరు.. హింసను క్షమించరు అని హెచ్చరించారు. కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ బలపడడం జీర్ణించుకోలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. తమ రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. తాము వెంకటరమణ రెడ్డికి, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *