– రెండేళ్ల ప్రగతిని చూపడమే రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యం
– డాక్యుమెంట్ తయారీకి ఐఎస్బీతో ఒప్పందం
– భవిష్యత్ తరాలకు మేలు కలిగేలా పునాదులు
– డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19 యువ రాష్ట్రం తెలంగాణ గత రెండు సంవత్స రాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజాభవన్ లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కలిసి బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ సమావేశ మందిరంలో ఆయన ప్రసంగించారు. మూడు ట్రిలియన్ డాలర్జ ఎకానమీ లక్ష్య సాధన సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ కల. ఆ కల సాధనకు ప్రతి ఒక్కరం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ లక్ష్య సాధనలో అందరినీ భాగస్వా ములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొం దించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించారని వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం ఐఎస్బీతో ఒప్పం దం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వివిధ శాఖల నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించి వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఐఎస్బీ బృం దం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. గ్లోబల్ సమ్మిట్ వచ్చేనెల 8, 9 తేదీల్లో జరగనుంది. తక్కువ సమయం ఉన్నందున పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డాక్యుమెంట్ను తుది దశకు తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అనేది చరిత్రలో లిఖించదగిన అంశమన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానా లు, వాటి అమలు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామని తెలిపారు. డిసెంబరు 9తో ప్రజా ప్రభుత్వం రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రెండేళ్లల్లో ఏం చేశామని చెప్పడం కంటే భవిష్యత్ తరాలకు మేలు చేకూరేలా ఏ విధమైన పునాదులు వేయబోతున్నాం, రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామనే విషయాలను ప్రపంచానికి విజయం డాక్యుమెంట్ ద్వా రా వివరించనున్నట్టు తెలిపారు. ఆర్థిక, పారిశ్రామిక, సర్వీ సు సెక్టార్లలో జీడీపీని పెంచి 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నదన్నారు. ప్రభుత్వం ఏ లక్ష్యాలు పెట్టుకొని ముందుకుపోతున్నదో వాటికి అధికారులంతా సహకరించి నిబద్ధతతో పని చేశారంటూ ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలిపారు. ఈ రెండేళ్లల్లో కనబరిచిన నిబద్దతతోనే 2047 డాక్యుమెంట్ రూపకల్పనకు అడుగులు ముందుకు వేయాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వివరించారు. రూ.36 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తయితే దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 39 రేడియల్ రోడ్లు, వాటిని కలుపుతూ పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు రానున్నాయని వివరించారు. వీటి ద్వారా పెద్ద మొత్తంలో పెట్టుబడులు రానున్నాయి.. వాటిని అంది పుచ్చుకొని ప్రణాళికలు రూ పొందించుకునేందుకు అన్ని శా ఖల కార్యదర్శులు ఐఎస్బి నిపుణులతో సమన్వయం చేసుకుంటూ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరచాలని సూచిం చారు. అన్ని శాఖల కార్యదర్శులు విజయం డాక్యుమెంటుకు సం బంధించి తమ తమ శాఖల మంత్రులతో భేటీ అయి కసరత్తు చేయాలని మంత్రులు సూచించే సలహాలను విజ యం డాక్యుమెంట్ లో జోడించాలని డిప్యూటీ సీఎం సూచించారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది వివరించేం దుకు దేశంలో అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నామని అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన కంపెనీల సీఈఓ లను ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్ ను పెద్ద పండుగలా నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రం లోని సంపద, వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చూపడమే కాదు వాటిని ఏ విధంగా కార్యరూ పం దాలుస్తామో కూడా అధికారులు ఇజం డాక్యుమెంట్ లో చూపించాలని పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా సిద్ధం చేయాలన్నారు. గురువారం అంతా శాఖల కార్యదర్శులు మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్ ను తుది దశకు తీసుకురావాలి. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు కూర్చుని కసర త్తు చేసి విజన్ డాక్యుమెంట్ కు ఆమోదం తెలియజేస్తారని డిప్యూటీ సీఎం వివరించారు. మంత్రు లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, చీఫ్ సెక్రటరీ రామకృ ష్ణారావు, స్పెషల్ జయేష్ రంజన్, సంజయ్ కుమార్, వికాస్ రాజ్, ఉన్నతాధికారులు శ్రీధ ర్, మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తాన్య, నవీన్ మిట్టల్, హరీష్బు, ద్ధప్రకాష్, కృష్ణభాస్కర్, నాగిరెడ్డి, చౌహన్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





