కన్నతల్లి కర్క‌శత్వం

–  రెండు నెలల చిన్నారిని పొయ్యిలో వేసింది

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: దుండిగల్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్న తల్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడిని క్టటెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. ఏడవకుండా నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు కట్టేసి మరీ హత్య చేసింది. బౌరంపేట్‌ ‌ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. ఈ ఘటనపై స్థానికుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండిగల్‌ ‌పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. బిహార్‌ ‌కు చెందిన కుటుంబం బౌరంపేట్‌లోని ఓ కన్‌‌స్ట్రక్షన్‌ ‌సైట్‌ ‌వద్ద పని చేస్తున్నట్లు సమాచారం. నవమోసాలు మోసి క‌న్న‌ బిడ్డను అతి దారుణంగా చంపడంపై స్థానికులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. పసిబిడ్డను చంపడానికి ఆమెకు మనస్సు ఎలా వచ్చిందంటూ శాప‌నార్థాలు పెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *