– భార్య, ఇద్దరు పిల్లల్ని బలిగొన్న భర్త
– తల్లీకూతుళ్ల హత్య కేసులో పురోగతి
వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో భర్తతోపాటు పదిమంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు డాక్టర్లు బాల్నె పూర్ణిమ, ఎస్.రవళి పరారీలో ఉన్నారు. ఐనవోలు మండలం పున్నేలులో ఈనెల 1న భార్య, ఇద్దరు కూతుళ్లను భర్త స్విమ్మింగ్‌పూల్‌లో నెట్టేసి చంపి ఘటన సంచలనం రేపింది. భార్యకు ఆడపిల్లలే పుడుతున్నారని భర్త అజారుద్దీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అప్పటికే భార్య ఫరహాత్ గర్భవతి. ఆమెకు గతంలోనూ రెండుసార్లు అబార్షన్లు చేయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తల్లీకూతళ్ల హత్యకు సహకరించిన కుటుంబ సభ్యులతోపాటు లింగ నిర్దారణ పరీక్షలు చేసిన సిబ్బంది, అబార్షన్లు చేసిన డాక్టర్లను నిందితులుగా తేల్చారు. కొడుకే పుట్టాలన్న కోరికతో నిందితుడు అజారుద్దీన్ భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. అప్పటికే భార్యకు లింగ నిర్దారణ పరీక్షలు చేయించి రెండు అబార్షన్లు చేయించాడని, మరోసారి గర్భం దాల్చడంతో ఆమెకు మళ్లీ ఆడపిల్లే పుడుతుందన్న భయంతో చంపేసినట్లు వివరించారు. ఓ బాలికను వివాహం చేసుకోవాలని అనుకున్నాడని, పథకం ప్రకారమే భార్య, పిల్లలను తన స్విమ్మింగ్‌పూల్‌కు తీసుకెళ్లి నీళ్లలో ముంచి చంపేసినట్లు చెప్పారు. అయితే అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసుýలో సెక్షన్లను మార్చి నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సిఫారుసు చేస్తామన్నారు. లింగ నిర్దారణ పరీక్షలు, అబార్షన్లు చేసిన వారిపై గతంలోనూ కేసులున్నాయని సీపీ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



