రైలు కిందపడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

-హైదరాబాద్ లో విషాదం
– చర్లపల్లి–ఘట్కేసర్ మధ్య మృతదేహాల గుర్తింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : హై దరాబాద్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చర్లపల్లి– ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు కనిపించడంతో గూడ్స్ రైలు లోకో పైలట్ వెంటనే అధికారులకు సమాచా రం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాల ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.పోలీసుల విచారణలో మృతులను బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పిన్నింటి విజయశాంతి (38), ఆమె కుమార్తె చేతన రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. చేతన ఇంటర్ సెకండియర్, విశాల్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలిసింది. విజయశాంతి ఇద్దరు పిల్లలతో కలిసి బోడుప్పల్లో నివసిస్తుండగా ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఆమె సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం పొందుతుండగా, సురేందర్ రెడ్డి నెల్లూరులోని ఓ సిరామిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఈ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘోర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే అంశంపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *