– ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి31: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలు కార్తీక్ (12), కౌశిక్ (10) లతో కలిసి రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటోంది. కుటుంబ తగాదాల కారణంగా భర్త ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు. అయితే, ఇటీవలే అతను రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ.. తన ఇద్దరు కొడుకులను చంపేసింది. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన స్థానికులు.. కూకట్‌పల్లి పీఎస్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. తల్లి ఇంతటి దారుణానికి పాల్పడటానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.