హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీకి శనివారం హయత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మూడు డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో రెండు పదవులను బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డికి 154 ఓట్లు, సందిల భాస్కర్‌కు 240 ఓట్లు వచ్చాయి. తెలంగాణ భవన్‌లో మధర్ డెయిరీ డైరెక్టర్‌గా విజయం సాధించిన పార్టీ నాయకుడు లక్ష్మీ నరసింహరెడ్డిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, పార్టీ నాయకులు ధర్మేందర్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




