– కాపాడిన స్థానిక యువకులు, డిడిఆర్ఎఫ్ బృందం
భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : కుటుంబ కలహాలతో భద్రాచలం బ్రిడ్జిపై నుండి శనివారం తల్లి కుమారుడు దూకిన సంఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు హటాహుటిన బ్రిడ్జి కిందకు వెళ్లి తల్లీకొడుకులను.కాపాడి సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో ఆత్మహత్య చేసుకోవడానికి భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో దూకింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్, చేపలు పట్టడానికి వెళ్ళిన ఇద్దరు యువకులు,డిడిఆర్ఎఫ్ బృందం మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించి వెంటనే స్పంది ంచి అట్టి మహిళను, ఆమె రెండేళ్ల కుమారుడిని కాపాడారు. వెంటనే అంబులెన్స్లో ఇరువురిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వారిరువురికి చికిత్సను అందించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడటం జరిగింది. తక్షణమే స్పందించి తల్లీకొడుకు ప్రాణాలను కాపాడిన బోటు ప్రసాద్, డిడిఆర్ఎఫ్ బృందం సభ్యులు, ఇద్దరు స్థానిక యువకులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



