మంత్రి దామోదర రాజనరసింహ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: . రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖాన (Government Hospitals) ల్లో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అలాగే, గాంధీ దవాఖానలో ఉన్న సిటి స్కాన్, ఎంఆర్ ఐ స్కాన్‌లతో పాటు ఇతర హెల్త్ ఎక్యూప్మమెంట్ ను పూర్తి స్థాయిలో వినియేగంలోకి తేవాలని ఆయన అధికారులను అదేశించారు. మంగళవారం గాంధీ దవాఖానని ఆకస్మిక తనిఖీ చేసి అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. దవాఖానకి వచ్చిన రోగులతో అప్యాయంగా మాట్లాడారు. దవాఖాన లో అందిస్తున్న చికిత్స లపై రోగులను , వారి వెంట వచ్చిన సహాయకులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం, గాంధీ దవాఖాన పనితీరు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గాంధీ దవాఖానలోసేవల బలోపేతం పై చర్చించారు హెల్త్ ఎక్యూప్ మెంట్ ను పూర్తి స్థాయిలో మరమత్తులు చేసేందుకు పీఎంయూ (ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ ) ను ఏర్పాటు చేసుకొని టీజీఎంఎస్ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు. దవాఖానలో శానిటేషన్ సమస్య , డ్రైనేజీ సమస్య పరిష్కరానికి ఎస్టీపీ లను ఏర్పాటు చేయాలని మంత్రి అదేశించారు. గాంధీ దవాఖానలో అన్ని ఆపరేషన్ థియేటర్లు ఒకే చోట ఉండేలా ఓటీ కంప్లెక్స్ ఎర్పాటు పై కమీటి నీ నియమించి నివేదిక ను సమర్పించాలని మంత్రి అదేశించారు. గాంధీ దవాఖాన కి వచ్చే పెషంట్ల సహాయకుల కోసం ప్రస్తుతం ఉన్న షెడ్డు స్థానంలో సీఎస్ ఆర్ నిధులతో కోత్తగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని మంత్రి అదేశించారు. గాంధీ దవాఖాన లో వైద్య సేవల బలోపేతానికి చర్యలు చేపట్టాలని మంత్రి అదేశించారు. వైధ్య సేవల అందించటంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. గాంధీ దవాఖానలో ఏపీ, ఐపీ సర్జరీలు, స్పేషాలిటీ సేవలు, సూపర్ స్పేషాలిటీ సేవలను అందించేందుకు ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.





