- జాతీయ సమస్యగా గుర్తించి చర్యలు తీసుకోవాలి
– లోక్‌సభలో ప్రస్తావించిన బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
న్యూదిల్లీ, డిసెంబర్ 3: కోతుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దమొత్తంలో వానరాలు పంటలను పాడు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని సూచించారు. కోతుల సమస్యపై గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని కొన్ని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని.. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కోతుల సమస్య చిన్న విషయంలాగా అనిపిస్తోందని.. కానీ అందరూ ఈ సమస్య గురించి తెలుసుకుని నవ్వుతారని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్య ఉందని గుర్తుచేశారు. విషయంలో నోడల్ ఏజెన్సీ అవసరమని చెప్పారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కోతుల సమస్యను ప్రజలు ప్రస్తావిస్తున్నారని గుర్తు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ సమస్య ఒక ఎజెండాగా మారిందని పేర్కొన్నారు. వానరాల సమస్యను పరిష్కరిస్తే సర్పంచ్‌గా గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని.. దేశ రాజధాని దిల్లీలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





