శతాబ్ధంలో కొత్త శబ్ధం…

“దేశ ఆర్థిక బలం కోసం, మానవాభివృద్ధి పేరుతో సంతానోత్పత్తిని తగ్గించే చర్యలు కొనసాగుతున్నప్పుడూ జనాభాలో తగ్గుముఖం పడుతూనే వస్తోంది. అప్పటికి ఆర్థిక బలమే నిజమైన నినాదం… మూలాలు అంటూ హిందూ సమాజానికి పిలుపునిచ్చి ముందుకు తీసుకెళ్లారు… మరో పక్క ముస్లిం వర్గంలో మాత్రం పిల్లలు భవిష్యత్తు దేవుళ్లగా పరిగణించి ముందుకెళ్తున్నా వాళ్లనూ జనాభా సమతూకంలో ఉండాలని కట్టడి చర్యలకు  గురి చేశారు.. అయినా వాళ్లు పరోక్షంగా పిల్లల భవిష్యత్తేనే కొనసాగించారు. ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నినాదానికి మార్చుకుంటున్నారు.”

నిర్వహణ” సిద్ధాంతంగా మారిన “నియంత్రణ” నినాదం

మోహన్ భగవత్… హిందూ మూలాలతో పరోక్షంగా దేశాన్ని నడిపిస్తున్న కీలక వ్యక్తి. ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా… ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా వెనుక అంతర్యార్థాలు ఎన్నో కనబడతాయి… ఇటీవల ఆర్ఎస్ఎస్ శాతాబ్ధి వేడుకల్లో మోహన్ భగవత్ మరో కొత్త నినాదాన్ని అందించిండ్రు..ప్రతొక్కరూ ముగ్గురు పిల్లలు కనాల్సిందేనని… దేశంలో కొన్ని నివేదికలు కూడా జనాభా విషయంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది అవసరమని స్పష్టం చేశాయి. దీని ఆధారంగా దేశాన్ని దృష్టిలో ఉంచుకొని చెబుతున్నట్లు తెలిపిండ్రు.. ప్రస్తుతం దేశంలో సరిపడే జనాభా ఉండాలి, లేకుంటే దేశంలోని కాలానుగుణంగా సమస్యలను ఎదుర్కోలేం, అందుకే ప్రతొక్కరూ ముగ్గురు మాత్రమే.. ఎక్కువ ఉండకూడదనేది అందరూ అంగీకరించాల్సిందేనని తెలిపిండ్రు.. హిందూ సమాజాన్ని ఐక్యం చేసి సాధికారత కల్పించాలని పిలుపునిచ్చిండ్రు. హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లలను కనాలి.. అలాగే చొరబాటు దారులు, మతం మారినోళ్లను గుర్తించాలి, ఉద్యోగాల్లో ఉంటే వారిని బహిష్కరించాలి. ఇదే హిందూ సమాజానికి కీలక మందు. తగ్గుతున్న హిందూ జనాభాను చూస్తే ఆందోళనకరంగా ఉందని మోహన్ భగవత్ అన్నారు.

ఇప్పటికే హిందూ కుటుంబాలు సగటు కంటే తక్కువగా సంతానోత్పత్తి ఉన్న సమాజాలు భవిష్యత్తులో నిర్వీర్యమవుతాయని చెప్పిండ్రు… ప్రస్తుతం ముందున్న పరిష్కారం కొత్త జనరేషన్ కు ముగ్గురు పిల్లల అవగాహన కల్పించాల్సిందే, సృష్టిని ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం. పౌర సమాజమంతా ఒకే దేశం, ఒకే జన్మభూమిపై పట్టుబిగించాలి. కాలానుగుణంగా సనాతన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని దేశానికి పిలుపునిచ్చారు… మన దేశ సాంప్రదాయం మహిళలకు గౌరవప్రదమైన స్థానం ఇస్తుంది, యావత్తు ప్రపంచంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు మన దేశ నాగరికతలో ఉన్నాయి.. అందుకోసం బలహీన వర్గాలకు మద్దుతుగా నిలిచి సమాజిక సామరస్యాన్ని పెంపొందించాలని మోహన్ భగవత్ అన్నారు… పరోక్షంగా అమెరికా, చైనాలో కొన్ని శక్తులు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కెరీర్ అంటే కేవలం ఎక్కువ సంపాదించడం లేదా వినియోగించడం కాదు.. ఇతరులను పంచుకోవడం, సేవ చేయడమనేది పిల్లలకు నేర్పించాలి. ముఖ్యంగా దేశానికి అన్నిటికంటే ఉన్నత విలువలు ఉన్న కుటుంబాలను అందించాలి. సమాజానికి వ్యక్తి కాదు, కుటుంబమే ప్రాథమిక యూనిట్ అని, సామాజిక ప్రవర్తన దానిలోనే రూపుదిద్దుకుంటుందని భగవత్ అన్నారు.

కాలంతో కరిగిపోయిన నినాదం:

1990లో దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో యావత్‌ దేశం ఆందోళనలో పడింది. అప్పట్లో జనాభా నియంత్రణ కోసం అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించారు. ‘‘ముగ్గురు వద్దు…ఇద్దరు ముద్దు’’ అనే నినాదాన్ని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఉద్యమంలా ప్రచారాలు చేశాయి. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పథకాలు రావని, అనర్హతగా పరిగణించి కట్టడి చర్యలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు కూడా ఇద్దరు పిల్లల నిబంధన గ్రామ, పట్టణ అమలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ నిబంధనలతో చట్టాలు చేసి అమలు చేస్తున్నారు. జనాభా పెరగడం వల్ల వచ్చే అనర్థాలను కళ్లకు గట్టినట్లు చెప్తూ ప్రచారం చేసేవారు. అయితే కాలం మారే కొద్ది ఇద్దరు బిడ్డల నినాదం మరింత బలంగా మారి ఆర్థిక అవకాశాలకు తలొగ్గి ఒక్కరికే పరిమితమైన కుటుంబాలు పెరిగాయి. అధిక సంతానం వల్ల వారి పోషించడంలో భారం, చదువు వ్యయం భరించలేమన్న భయం బాగా ఫలించింది.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సరికొత్త నినాదం అమల్లోకి వచ్చింది. పిల్లలను ఎక్కువ మందిని పిల్లలు ఉంటేనే జాతి నిర్వీర్యాన్ని అడ్డుకోగలమని ముందున్న లక్ష్యంగా మారింది. ఒకప్పుడు స్థానిక సంస్థలు, సర్పంచ్ ఎన్నికల్లోనూ ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులుగా ప్రకటించారు. సమాజంలో ఇద్దరు పిల్లలు నినాదాన్ని బలేపేతం చేసేందుకే ఆ నిబంధనను అనుచరించిండ్రు.. తాజాగా మరిన పరిస్థితుల దృష్ట్యా నిబంధను కూడా ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిబంధన ఎత్తివేయడంపై చర్చనీయంగా మారింది. మొన్నటి వరకు పాత నిబంధననే అమలులో ఉంచిండ్రు.. కొత్త చట్టాన్ని రూపొందించినప్పుడు ప్రభుత్వాలు మార్చుకోలేదు. పలు రాజకీయ పక్షాలతో పాటు ప్రముఖలు నిబంధన ఎత్తివేయాలని కోరడంతో ఇద్దరు పిల్లల నిబంధనకు చెక్ పడింది. తెలంగాణలో ఆమోదానికి రాలేదు కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం చంద్రబాబు పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నా పోటీ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

ముగ్గురు పిల్లల వెనుక అంతర్భావం:

మోహన్ భగవత్ సంఘ్ సభలో ప్రకటించిన నినాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇప్పుడిప్పుడే చెబుతున్నది కాదు.. ఎంతో కాలం నుంచి జనాభా విషయంలో అప్రమత్తంగా ఉండాలని జనాభా పెరగాలని చెప్పుకుంటూ వస్తున్నారు అయితే అది ఒక వర్గానికి అనుసరించినదే. ఎన్నికల సమయంలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పిండ్రు.. అన్ని మతాలను విమర్శించకుండా పిల్లలను కనాలని చెప్పడం వెనుక స్వార్థపూరికతమైన లక్ష్యం కనబడుతోంది. ఎక్కువ మంది పిల్లలతో జిందగీని సాగించేవాళ్లకు తెలుస్తుంది నొప్పేంటోనని, సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకొని స్వార్థ భావనలు ప్రచారం చేసిన సన్యాసులకు, కుటుంబ బతులకులంటే తెలియని బ్రహ్మచారులు, సాధువులు, మునులకు ఎలా తెలుస్తుంది?. ముందుగా ముగ్గురు పిల్లలను వర్గంలో ఎంతమంది కంటున్నారు.

వాళ్లకు బతుకు భరోసా ఎలా ఉందో, జనాభా పెరగాలన్నే లక్ష్యానికి ఎంతమంది కట్టుబడి ఉన్నారో అనేది ఆచరణలో చూపించాలి. జనాభా రేటు తగ్గడమనేది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియనే… అయితే హిందూ సమాజం తగ్గుతోందనడం సరైనదికాదు.. వోట్ల కోసమే బలం మాటున భావనను ప్రదర్శిస్తున్నారనేది కనబడుతోంది. దేశంలో ముస్లిం, ఇతర మతాలు రాకముందు ఉన్న మతమేంటి..? దానితో మనకు ఒరిగిందేమిటి ? జనాభా పేరుతో హిందువులు తగ్గుతున్నారనేదే ముఖ్యమైన అంశం. ప్రస్తుతం హిందువుల మనుగడ పుట్టే పిల్లలపై ఆధారపడి ఉందనేది తెలుస్తుంది.. మరో వర్గం ముస్లింలను అడ్డుకొనే శక్తి కోసమే పిల్లలు కనాలనేది కనబడుతోంది. హిందూ సమాజం నిర్వీర్యం అయితే ఏం జరుగుతుంది.. ఇతర దేశాల్లోనూ మన దేశ సంతతివాళ్లు ఉన్నారు.. మరి అక్కడ దేశ సంస్కృతులు పాటించకుండా ఉండలేరెమో కాదా…? మన దేశంలో హిందూ మాటున ఉన్న హింసాత్మక వ్యక్తుల మనుగడ కోసం నినాదాలను తీసుకొస్తున్నారు.

ఎవరిది తప్పు:

దేశ ఆర్థిక బలం కోసం, మానవాభివృద్ధి పేరుతో సంతానోత్పత్తిని తగ్గించే చర్యలు కొనసాగుతున్నప్పుడూ జనాభాలో తగ్గుముఖం పడుతూనే వస్తోంది. అప్పటికి ఆర్థిక బలమే నిజమైన నినాదం… మూలాలు అంటూ హిందూ సమాజానికి పిలుపునిచ్చి ముందుకు తీసుకెళ్లారు… మరో పక్క ముస్లిం వర్గంలో మాత్రం పిల్లలు భవిష్యత్తు దేవుళ్లగా పరిగణించి ముందుకెళ్తున్నా వాళ్లనూ జనాభా సమతూకంలో ఉండాలని కట్టడి చర్యలకు గురి చేశారు.. అయినా వాళ్లు పరోక్షంగా పిల్లల భవిష్యత్తేనే కొనసాగించారు. ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నినాదానికి మార్చుకుంటున్నారు. పిల్లలను కనాలి.. ఎంత మంది కనాలని చెప్తే అంతే కనాలి… ఇదే ఆర్ఎస్ఎస్ కు ఉన్న స్వార్థపూరితమైన లక్ష్యం.. మతానికి బలం చేకూర్చేందుకు పిల్లలు అవసరమైతే కనాలనే చెబుతున్నారు.

మరి ఆర్థిక బలం సంగతేంటి..? జనాభా తగ్గితే అభివృద్ధికి మూలం అన్నారు.. ఇప్పుడేమో జనాభా పెరగాలంటున్నారు. ఇప్పటి వరకు ఆర్థిక బలమూ లేదు, అభివృద్ధి లేదు.. కేవలం మతోన్మాద బలమే సాధించినట్లా… ఇతర ముస్లిం, క్రైస్తవ దేశాల్లో సంతానోత్పత్తితో సమానంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే చర్యలు పాటించినాయి..ఎంత పెద్ద కుటుంబమైనా, ఎంతమంది పిల్లలు ఉన్నా ఆర్థిక భరోసాను బాధ్యతగా తీసుకున్నాయే తప్ప ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోలేదు..మరి మనదేశంలో జరుగుతున్నదేంటి..? పిల్లలను కనాలని చెబుతున్న ఆర్ఎస్ఎస్.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బాగోగుల కోసం ఏం చేస్తుంది.. మద్దతు ప్రభుత్వాలకు ఏం భరోసా ఇస్తుందో స్పష్టం చేయాల్సిందే.

పట్ట హరిప్రసాద్,

ఫోన్: 8790 84 3009

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *