– మోదీ అమెరికాకు అమ్ముడుపోయారు
– అదానీ కేసులో మోదీకి భయం పట్టుకుంది
– అమెరికా ట్రేడ్ డీల్‌పై ప్రతిపక్ష నేత రాహుల్
న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్‌కు ప్రధాని మోదీ అమ్ముడుపోయారని ఆరోపించారు. ట్రంప్ వత్తిడికి మోదీ తలొగ్గినట్లు ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలో డియాతో రాహుల్ మాట్లాడారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసు వల్ల ప్రధాని మోదీ తీవ్ర వత్తిడిలో ఉన్నట్లు ఆరోపించారు. అదానీపై అమెరికాలో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మోదీ ఆందోళనలో ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. మోదీజీ భయపడుతున్నారని, నాలుగు నెలలుగా వాణిజ్య ఒప్పందం స్తంభించిందని, నిన్న సాయంత్రం ఒప్పందం కుదుర్చుకున్నా రని గాంధీ అన్నారు. మోదీ ఇమేజ్‌కు చెందిన బెలూన్ వేల కోట్లతో తయారైందని, అది ఏ క్షణమైనా పేలుతుందని ప్రతిపక్ష నేత అన్నారు. భారతీయ రైతులు ఆ డీల్ గురించి ఆలోచించాలని, శ్రమ, రక్తం, చమటను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. కేవలం రైతులే కాదు. యావత్ దేశాన్ని అమ్మేశారని, అందుకే తనను సభలో మాట్లాడనివ్వడం లేదని రాహుల్ అన్నారు. నాలుగు నెలలుగా నిలిచిపోయిన భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ డీల్ వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వణుకుతున్నారు.. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నాలుగు నెలలుగా నిలిచిపోయింది.. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోదీ సంతకం చేశారు. నరేంద్ర మోదీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకపోవడం ఇదే మొదటిసారి. దేశాన్ని అమ్మేశారు. ఇంతవరకూ మలచుకుంటూ వస్తున్న తన ఇమేజ్ ఇప్పుడు దెబ్బతింటుందోనని మోదీ భయపడుతున్నారు’ అని రాహుల్ విమర్శించారు. మోదీ భయపడడానికి కారణాలను రాహుల్ వివరిస్తూ.. ’అదానీపై అమెరికాలో కేసు ఉంది. నిజానికి ఇది మోదీపై కేసు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చాలా విషయాలున్నాయి. దానిని అమెరికా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆ ఒత్తిడి కూడా ఉంది. ఒత్తిడికి కారణమవుతున్న రెండు పాయింట్లు ఇవే. దేశం దీనిని అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


