ఆరోగ్యాన్ని హరిస్తున్నఆధునిక జీవనశైలి

పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు అన్నీ వయస్సుల ప్రజల జీవితం మీద ప్రభావం చూపుతున్నాయి. పాత తరం జీవనశైలిలో భౌతిక శ్రమ ఎక్కువగా ఉండేది, కానీ ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువవుతుంది. దీని ప్రభావంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అకాల మృతులకు 60 శాతం వరకు జీవనశైలి వ్యాధులే కారణమవుతున్నాయి. ఆధునికత పేరు చెప్పి మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన చేతుల చేత మన ఆరోగ్యాన్ని తుడిచిపెడుతున్నాం: జీవితశైలి పేరుతో వస్తున్న కొని తెచ్చుకుంటున్న నాశనం.
పెద్ద నగరాల్లో తీవ్రత ఎక్కువ:
జీవనశైలి వ్యాధులలో ముఖ్యంగా గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఫాస్ట్ ‌ఫుడ్‌, ‌శారీరక వ్యాయామం లోపం, తినే విధానం, ఒత్తిడిగల జీవనశైలి ఇవన్నీ ముఖ్య కారణాలు. మహానగరాల్లో జీవించే ప్రజల్లో ఈ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నలబై ఏళ్ల లోపే హార్ట్ ఎటాక్‌లు వస్తుండటం కేవలం జీవనశైలిలో మార్పుల వల్లే జరుగుతోంది.
మనుషులు ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారు:
ఆహార అల వాట్ల లో మార్పు, ఫిజికల్‌ ‌యాక్టి విటీ లోపం, ఒత్తిడి మరియు నిద్రలేమి వల్ల నానాటికీ జీవ నశైలి వ్యాధులు పెరిగి పోతు న్నాయి. ఆధునిక జీవన శైలిలో మాన వుడు ఆరో గ్యాన్ని తాకట్టు పెడుతు న్నాడు. గ్యాడ్జెట్లు, బిజీ షెడ్యూ ల్స్, ఆరోగ్యంపై నిర్లక్ష్యం వంటి వాటితో పాటు, స్మార్ట్ ‌ఫోన్‌ ‌వినియోగం కూడా దీని మీద ప్రభావం చూపుతోంది.
 మానసిక ఆరోగ్యంపై దృష్టి:
జీవనశైలి మార్పు లు శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరో గ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కొన్ని చిట్కాలు ముఖ్యమైనవి: రోజూ ఒకే సమయానికి నిద్ర, భోజనం, కార్యాచరణ ఉండేలా జీవనశైలి సజావుగా ఉండాలి. కనీసం 30 నిమిషాల వ్యాయామం లేదా యోగా, ప్రాణాయామం చేయడం మనశ్శాంతికి దోహదం చేస్తుంది. ధ్యానం మరియు శ్వాస నియంత్రణతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 వంటివి చేర్చాలి. నిద్ర పరిపూర్ణంగా ఉండేలా చూసుకోవాలి (7-8 గంటలు అవసరం). స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుబంధం కొనసాగించాలి. సెల్‌ ‌ఫోన్‌ ‌వినియోగాన్ని నియంత్రించాలి. కళలకు అవకాశమివ్వడం ద్వారా భావోద్వేగాల్ని సమతుల్యంగా ఉంచుకోవచ్చు. ఈ చిట్కాల వల్ల మనస్సు ఆరోగ్యంగా ఉండటమే కాక, జీవితం సంతృప్తికరంగా మారుతుంది.
ఒత్తిడితో బతుకు చిద్రమవుతోంది
ప్రస్తుత ఆధునిక జీవన శైలి మనిషిని ఓ యంత్రంగా మార్చేసింది. పనుల ఒత్తిడి, సమయపు తగ్గుదల, సామాజిక ఒత్తిళ్లు అన్నీ కలిసివచ్చి మనుషులను అంతర్ముఖులుగా మార్చేస్తున్నాయి. నిత్యం పరుగులు పెట్టే జీవితంలో మనసుకు తృప్తి లేక, శరీరానికి విశ్రాంతి లేకుండా పోతోంది. ఈ ఒత్తిడిలో శ్వాస కూడా భారంగా అనిపించడం మనిషికి సాధారణంగా మారిపోతోంది. ఒత్తిడి వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, ఆరోగ్యం పాడవుతోంది, ఆనందం దూరమవుతోంది. ఆర్థిక విజయాల కోసం కష్టపడుతూ, మనిషి తనే నిస్సారంగా మారుతున్నాడు. భౌతిక విజయం కోసం పరిగెత్తే ఈ యుగంలో, మనస్సుకు నయం కలిగించే ప్రశాంతత అరుదైపోతోంది. ఈ పరిస్థితుల్లో మన మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అత్యవసరం.
మానసిక ప్రశాంతత ఇప్పుడు అత్యవసరమైన ఔషధం
ప్రజలు తమ జీవనశైలిని పునఃపరిశీలించాలి. రోజూ క్రమంగా వ్యాయామం, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, మానసిక శాంతి కోసం యోగా, ధ్యానం లాంటి కార్యక్రమాలను అనుసరించాలి. ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖలు ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే కుటుంబ సభ్యుల మద్దతు, ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తమ జీవనశైలిని మెరుగుపరచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. నవ్వు జాడలేని ముఖాలు, నిరాశతో నిండిన కన్నులు.  ఇవే ఆధునిక జీవితం గుర్తులు. ఈ బతుకు జట్కా బండిలో ఏం కోల్పోయామో నెమ్మదిగా తెలుసుకుంటున్నాం. కానీ చాలా ఆలస్యం అయిన తర్వాత ఒత్తిడిలో మునిగిపోయిన ఈ సమాజానికి, ఓ కాసింత మానసిక ప్రశాంతత ఇప్పుడు అత్యవసరమైన ఔషధం.
atla sreenivas
డా.అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్
9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *