మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిరదని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి 24 గంటలలో ఒరిస్సా తీరాన్ని దాటే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి బికనీర్‌, జైపూర్‌, డాత్యా, సిద్ధి, రaార్సుగూడ, పూరి అటు నుండి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కేంద్రం వరకు కొనసాగుతోంది. రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఈరోజు, రేపు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అకురిసే అవకాశం ఉంది ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటినుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *