బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ జాగృతి నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. బస్ పాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ జాగృతి కార్యకర్తలతో కలిసి మంగళవారం బస్ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కవిత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుంటోందని, విద్యార్థులు, ప్రజలపై తీవ్ర భారం పడుతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం చంద్రయాణ గుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  దాంతో జాగృతి కార్యకర్తలు సైతం భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *