హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: నగరంలో దోమల సమస్యను ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దోమ తెర ధరించి, ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. అనుమతి లేదని ఎమ్మెల్యేను మార్షల్స్ అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి దోమ తెర లాక్కునేందుకు యత్నించారు. దీంతో మార్షల్స్‌పై సుధీర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలో కొత్త నిబంధనలు ఎక్కడివని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దోమల తీవ్రతకు ప్రజలు హైదరాబాద్ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనివల్ల నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని చెప్పారు. దోమల బెడద నుంచి ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





