– బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం
నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి26: ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రాజకీయాలంటే ఏదో అనుకుని ఆలామంది భ్రపడతారని అన్నారు. ప్రజలకు సేవచేయడం, ప్రధాన లక్ష్యం కావాలన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని 12వ వార్డు బేతాళ స్వామి కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిన నియోజకవర్గాల్లో బాన్సువాడ ఒకటన్నారు. పట్టణాభివృద్ధికి రూ.600 కోట్లు వెచ్చించామన్నారు. విద్య, వైద్యం సాగు, తాగునీటిలో ముందున్నామని పేర్కొన్నారు. తన కుటుంబంలో ఉన్న సౌకర్యాలు పేద ప్రజల ఇళ్లలో ఉండాలనే ఆలోచించనతోనే రెండు పడక గదుల నిర్మాణాలు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ బాలరాజ్, తనది ఒకే ఆశయమని, ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గత మున్సిపల్ ఎన్నికల్లో వార్డు అభివృద్ధికి ఇచ్చిన హాలు అమలు జరిగితేనే ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.