హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: జూబ్లీహిల్స్ నియోజవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయసాధనకు విశేష కృషి చేసిన రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ రాష్ట్ర సచివాలయంలో బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. రహ్మత్ నగర్, బోరబండ డివిజన్‌లకు ఇన్‌చార్జిగా వ్యవహరించి మంచి ఆధిక్యత రావడానికి మంత్రి పొంగులేటి చేసిన కృషిని ప్రస్తావిస్తూ నవీన్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంచి ఆధిక్యతతో ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





