సిఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు

– ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 26: సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు నమోదైంది. రాజేంద్ర నగర్‌ ‌పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు డియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి.. సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ‌పార్టీ రాజేంద్రనగర్‌ ‌అధ్యక్షుడు ప్రభాకర్‌ ‌రెడ్డి.. కౌశిక్‌ ‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిపై కౌశిక్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాజేంద్రనగర్‌కు చెందిన కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్‌ ‌పోలీసులు తెలిపారు. సిఎంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో కౌశిక్‌రెడ్డి నివాసానికి ఆయన మద్దతుదారులు, బిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు భారీగా చేరుకున్నారు. కొండాపూర్‌లోని కొల్లా లగ్జరీస్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసం ఉండగా, ఆయన ఇంటిపై ఏ క్షణమైన దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు దాడి చేస్తే అడ్డుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *