తెలంగాణ సర్కార్‌పై ఎమ్మెల్యే హరీష్‌రావు విసుర్లు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వొస్తే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు రెండు చీరలతో పాటు రూ.500 కానుకగా ఇస్తామని అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ రెండు చీరల మాటటుంచి కనీసం ఒక చీర లేదూ…500రూపాయలు కూడా ఇవ్వలేదని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ సీఎం ఉండగా ప్రతీ బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు కొత్త చీరలను ఉచితంగా ఇచ్చేవారనీ, రెండు చీరలిస్తామని అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం ఒక చీరను కూడా ఇవ్వలేదన్నారు. గురువారం రాత్రి సిద్ధిపేట కోమటిచెరువు వద్ద సద్దుల బతుకమ్మ పండుగ ముగింపు వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సిఎం అయ్యాక బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగను అధికారికంగా గుర్తించారనీ, దీంతోనే అమెరికాలాంటి దేశాల్లోనూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలన్నారు. గతంలో బతుకమ్మ పండుగకు కేసీఆర్ ఆడపడుచులు కొత్త చీరలను కట్టుకోవాలనే ఉద్దేశంతో కొత్త చీరలను అందించేవారనీ, దీంతో ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా జరుపుకునేవారన్నారు. గ్రామాల్లో సర్పంచులు లేక ఈ పండుగకు ప్రజలకు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ, ఉన్న డబ్బులను పెట్టి పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలయ్యారన్నారు.
మునిసిపాలిటీల పరిస్థితి కూడా నిధులు లేక అధ్వాన్నంగా తయారై అత్యంత వైభవంగా నిర్వహించాలని బతుకమ్మ పండుగను మామూలుగా ముగించారన్నారు. ఈ పండుగ రోజు కులాలతీతంగా ప్రతి ఒక్కరూ చెరువుల వద్దకు వొచ్చి ఘనంగా ఈ వేడుకలను జరుపుకుంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య ఈ పండుగను జరుపుకుంటారన్నారు. బతుకమ్మ పండుగ కులాల అతీతంగా జరుగుతుందనీ, బతుకమ్మ పండుగ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, కొండపం సంతప్‌రెడ్డి, పాల సాయిరాం, సుందర్, బెల్లంకొండ వెంకట్ తదితరులు ఉన్నారు.





