నేను కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఉన్నా

– ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌తాను కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఉన్నానని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ‘నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. జీహెచ్‌ఎం‌సీలో కాంగ్రెస్‌, ఎంఐఎం ‌కలిపి మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయి. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ అం‌తటా ప్రచారం చేస్తా.. కాంగ్రెస్‌ ‌పథకాలను వివరిస్తా అని నాగేందర్‌ ‌తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో గెలిచిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు దిశగా గులాబీ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరూ తాము బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోనే ఉన్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో దానం నాగేందర్‌ ‌మాత్రం తాను కాంగ్రస్‌లో ఉన్నానని ఒప్పుకున్నారు. హైకమాండ్‌ ‌నుంచి స్పష్టమైన హా రావడంతోనే దానం నాగేందర్‌ ఈ ‌ప్రకటన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *