~ గాయపడిన బాలుడి కుటుంబ ఖాతాలో జమ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పుష్ప సినిమా బెనిఫిట్ షోలో గాయపడిన బాలుడి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడిన బాలుడి అక్కకు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో మిషన్ వాత్సల్య పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ పథకం కింద బాలికకు ప్రతి నెలా రూ.4,000 చొప్పున 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇప్పటివరకు గత మూడు నెలలకు మొత్తం రూ.12,000లు బాలిక చదువు నిమిత్తం నేరుగా కుటుంబ ఖాతాలో జమ చేశారు. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి అందించిన మానవీయ సహాయానికి వారు చైల్డ్ రైట్స్ కమిషన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్య బాధితుల పట్ల ప్రభుత్వ విధానాలలో మానవతా విలువలకు చిహ్నంగా నిలుస్తుందని, చైల్డ్ రైట్స్ కమిషన్, మిషన్ వాత్సల్య ద్వారా మరెంతోమంది బాధిత బాలల కుటుంబాలకు అండగా నిలిచేలా చర్యలు కొనసాగించనుంది అని కమిషన్ సభ్యలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




