అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

– మ‌హిళ భ‌ద్ర‌త‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాధాన్యం
– ఆత్మీయ‌త‌, ఆత్మ‌గౌర‌వానికి రాష్ట్రం ప్ర‌తీక‌
– తెలంగాణ‌ను ఆకాశానికెత్తేసిన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు

72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన హెడ్టుహెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా, వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని — ముఖ్యంగా హైదరాబాద్‌ను — అభినందనలతో ముంచెత్తారుఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి పోటీదారులు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌
తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని పలువురు స్పష్టం చేశారుభద్రత అనేది ఒక హక్కు, దానిని అందించడంలో తెలంగాణ ముందున్న‌ దన్నారుహైదరాబాద్ నగర వీధుల్లో మహిళలు రాత్రిపూట కూడా భయపడకుండా స్వేచ్ఛగా తిరగగలగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారుఇది ఒక సురక్షిత నగరానికి ప్రతీక అని అభివర్ణించారుపోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ షీ టీమ్స్, హాక్ ఐ, 24×7 పర్యవేక్షణ వంటి సాంకేతిక భద్రతా వ్యవస్థలను పరిశీలించి మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు త‌మ‌ను విశేషంగా ఆక‌ర్షించాయ‌న్నారు.

తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?
తెలంగాణ సాంకేతికత, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా, మహిళల హక్కులు, విద్య, సాధికారతకు కూడా అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంగా పలువురు పేర్కొన్నారుఇది ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారుతెలంగాణ ప్రజల ఆత్మీయత, ఆదరణ, ఆతిథ్య భావం ప్రత్యేకంగా నిలిచిందని అన్నారురాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు స్ఫూర్తిదాయకంగా అనిపించాయని, ‘బ్యూటీ విత్ పర్పస్’ భావన ఇక్కడ జీవనశైలిలోే కనిపించిందని చెప్పారు.
తెలంగాణ అనుబంధాల తాటిపై నిలిచిన భూమి, స్నేహబంధాలకు నిలయం, సంస్కృతికి ప్రతీకగా భావిస్తున్నామని చెప్పారు72వ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ల అభిప్రాయంలో  తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన, మహిళలకు భద్రత కలిగిన, ఆత్మీయత నిండిన ప్రగతిశీల రాష్ట్రంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *