– వదంతులు నమ్మవద్దన్న విద్యా శాఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఈ ప్రచారాన్ని తెలంగాణ విద్యా శాఖ ఖండించింది. ఈ ప్రచారం అసత్యం.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇంటర్ ఫలితాల ప్రకటన షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కాలేదన్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఒక పోస్ట్ పెట్టింది. గతంలో ఇంటర్ ఫలితాలు విడుదలైన తేదీలు.. 2014లో మే 3, 2015లో ఏప్రిల్ 22, 2016లో ఏప్రిల్ 22, 2017లో ఏప్రిల్ 16, 2018లో ఏప్రిల్ 13, 2019లో ఏప్రిల్ 18, 2020లో జూన్ 18 (కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేయటం జరిగింది), 2021లో జూన్ 28 (కోవిడ్ కారణంగా), 2022లో జూన్ 28, 2023లో మే 9, 2024లో ఏప్రిల్ 24, 2025లో ఏప్రిల్ 22న ప్రకటించారని తెలిపింది. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర అంశాలనుబట్టి ఫలితాల విడుదల అయ్యే తేదీలు ఏటా మారుతుంటాయని విద్యాశాఖ తెలిపింది. అదే విధానం ఈ సంవత్సరం కూడా కొనసాగుతుందని, ఇంటర్ ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



