– మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క
– మేడారంలో ‘ప్రజాతంత్ర’ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
ములుగు, ప్రజాతంత్ర, జనవరి 24 : పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహా జాతరలో ప్రజాతంత్ర దినపత్రిక క్యాలెండర్, డైరీలు-2026ను శనివారం ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. నిజాలను వెలికి తీసేలా పత్రికలు పనిచేయాలని, పత్రికల పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సమాచారాన్ని ప్రజలకు, పాలకులు, అధికారులకు చేరవేయాలని అన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక పనితీరు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్.పి. సుధీర్ రామ్నాథ్ కేకన్, ప్రజాతంత్ర రిపోర్టర్లు కేతిరి బిక్షపతి, తిరుమల రావు, కుమార్, ఆర్ టి సి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


