మంత్రులంద‌రం నిబ‌ద్ధ‌త‌తో పనిచేస్తున్నాం

– రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు
– నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం
– పాత బస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ,
– దేశానికి ఆదర్శంగా మెట్రో వ్యవస్థ
– రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూస్తాం
– రిటైర్మెంట్ ఉద్యోగులు బాధపడొద్దు
– ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో డిప్యూటీ సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ముందుగా సభ్యుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండరాదు అన్న ఆలోచనతో రూ.22,500 కోట్లతో ఒక్కో ఇంటిని రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నాం. వారం వారం ఇందిరమ్మ బిల్లులు చెల్లిస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైల్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం. పాÔ áబస్తీలో మెట్రో పనులను స్థానిక ప్రజాప్రతినిధులు వేగవంతం చేయించండి బిల్లులు చెల్లిస్తాం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్. మూసి పునర్జీవనం, చార్మినార్, బిర్లా మందిర్, గోల్కొండ లాడ్ బజార్ వంటి వాటిని టూరిజం ప్రాంతాలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.గ్యాస్ పెట్రోల్ డీజిల్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు హామీ ఇస్తున్నాము. అంబర్‌పేట్- ముసరాంబాగ్ బ్రిడ్జి, నల్గొండ చౌరస్తా వద్ద నిలబడుతున్న నీళ్లు సమస్యను పరిష్కరించే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుంది. హైదరాబాదే కాదు రాష్ట్రంలో ఎక్కడ నీటి కొరత లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. నగరంలో ప్రతి నాలా వద్ద ఎస్టిపి పెట్టి మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే మూసీ నదిలోకి వదిలే ప్రయత్నం చేస్తున్నాం. ఒకేసారి 39 ఎస్టిపిలు శాంక్షన్ చేసి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. ఇది మా ప్రభుత్వ నిబద్ధత. పాతబస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ పనులు ప్రతిపాదనలో ఉన్నాయి. పాత బస్తీలో రహదారులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను దశలవారీగా మారుస్తాం. అత్యవసరమని భావిస్తే స్థానిక ప్రజాప్రతినిధులు జాబితా ఇవ్వండి వెంటనే పరిష్కరిస్తాం. కొత్తగా ఒకేసారి 25 రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నాం ఏ రిటైర్డ్ ఉద్యోగి బాధపడాల్సిన పనిలేదు వారిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రతినెల ప్రస్తుతం 700 కోట్లు చెల్లిస్తున్నాం ఆ సంఖ్యను వెయ్యి కోట్లకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి బిల్స్ వెనువెంటనే క్లియర్ చేస్తున్నాం ఓవర్సీస్ స్కాలర్షిప్స్ క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నాం. విదేశాల్లో చదివే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు అక్కడ ఎవరూ ఉండరు అనే మానవ కోణంతో వెంటనే రిలీజ్ చేస్తున్నాం. హెలికాప్టర్లో ప్రయాణించాలని ఎవరికీ ఉండదు ప్రయాణించే మంత్రులను అభినందించాలి. మంత్రుల ఒక్క నిమిషం సమయం కూడా అత్యంత విలువైనది ఆ విలువైన సమయాన్ని సరిగ్గా వాడుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వంలోని మంత్రులు బాధ్యత నిబద్ధతతో పనిచేస్తున్నారు.
కేంద్ర పథకాల్లో రాష్ట్ర మ్యాచింగ్ 3,000 కోట్లు పెండింగ్ ఉంటే కట్టాం. రాష్ట్రం యుటిలైజేషన్ సర్టిఫికెట్లను పెండింగ్లో పెట్టుకోలేదు. ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేశారు, దానిని కేంద్ర ప్రాయోజిత పథకం గా మార్చారు. గతంలో 100% నిధులు కేంద్రమే భరించేది, గ్రామసభ నిర్వహించి ఏ పనులు చేపట్టాలో ప్రజలు స్థానికంగా నిర్ణయించుకునేవారు. కానీ కొత్తగా వచ్చిన చట్టం లో ఢిల్లీలో ఉండి వెబ్ సైట్ లో లో ఏ పనులు చేయాలో ఖరారు చేస్తారు. గ్రామసభను నిర్వీర్యం చేశారు. కొత్త నిబంధనలో కేంద్రం కేవలం 60 శాతం నిధులు కేటాయిస్తుంది మిగిలిన 40 æతం రాష్ట్రాలు భరించాలి.విబి రాంజీ పథకాన్ని ఎత్తివేయాలని గతంలో తీర్మానం చేశాం మరోసారి పార్టీలకు అతీతంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాం. మూడు శాతం లోపు ఫిజికల్ బడ్జెట్ ఉండవచ్చని కేంద్రం అనుమతించింది మనం 2.8% లోనే ఉన్నాం. అసంఘటిత రంగ కార్మికుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు గీత్ చట్టం తెచ్చాం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. తాజా బడ్జెట్లో రాష్ట్రంలోని ఏ ఒక్క కుటుంబాన్ని మేము వదిలిపెట్టలేదు. అందుకే ఇది పీపుల్స్ బడ్జెట్. ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తున్నాం. ఒక్కో స్కూల్లో 1500 మంది విద్యార్థులు ఉంటారు. వారిని ఉదయాన్నే ఇళ్ల నుండి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి పాఠశాలకు తీసుకువస్తాం, రాగానే వారికి మూడు రోజుల పాటు పాలు మరో మూడు రోజుల పాటు రాగి జావా అందించి ఆ తర్వాతే పాఠాలు బోధిస్తారు. మధ్యాహ్న భోజనం ఉంటుంది. సాయంత్రం తిరిగి ఇంటి వద్ద దింపి వస్తారు. ఈ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు, షూస్, టై అన్ని ఉచితంగా సరఫరా చేస్తాం
రాష్ట్రం వసుదైక కుటుంబంలా పెరగాలనేది ధీరోదాత్త ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన. విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న ఒక ప్రత్యేక ఫ్యాషన్తో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద పెట్టుకొని ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారు. ఈ తరహా పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవు
ఉద్యోగాల కల్పనకు టామ్ కామ్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు స్కిల్ యూనివర్సిటీ ఇతర దేశాల్లో ఉద్యోగానికి వెళ్లే పిల్లలకు ఆ దేశ భాషలు నేర్పించడం.. ఇది కథ మన కమిట్మెంట్ ప్రజల పట్ల మా ప్రభుత్వం నిబద్ధత. దేశంలో ఎక్కడా లేనివిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఒక్కో పాఠశాలను 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నాం. ఈ స్కూళ్లలో చదివే పిల్లలు ప్రపంచంతో పోటీ పడతారు. వసతి గృహాల హద్దులను ప్రతినెల చెల్లిస్తున్నాం విద్యార్థుల డైట్ చార్జీలను 40% కాస్మోటిక్ చార్జీలను 200% పెంచాం. ఇక ఉన్నత విద్య విషయానికొస్తే ఉస్మానియా యూనివర్సిటీకి వంద కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కేటాయించాం. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కి 500 కోట్లు. మిగిలిన యూనివర్సిటీలకు నిధులు కేటాయించాం. ఉన్నత విద్య శాఖకు నిధులు కేటాయించాం అందులో నుంచి కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి నిధులు ఖర్చు చేస్తాం. ప్రజా ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది దేశవృద్ది రేటు ఎనిమిది శాతం ఉండగా తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటు 10.7% ఉంది.  2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకెళుతున్నది


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *