హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 10: డీజీపీ కార్యాలయ మినిస్టీరియల్ స్టాఫ్ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డిజిపి వారికి అభినందనలు తెలుపుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం సమష్టిగా, సమర్థంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈసారి నిర్వహించిన ఎన్నికల్లో స్టాఫ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భవిష్యత్ కార్యాచరణలో పారదర్శకత, సేవాభావం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని నూతన కార్యవర్గం తెలిపింది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు వరుసగా ప్రెసిడెంట్ – ఆర్. ఉపేందర్ రెడ్డి (సీనియర్ అసిస్టెంట్), వైస్ ప్రెసిడెంట్ – I – ఎన్. రాజేందర్ (సూపరింటెండెంట్), వైస్ ప్రెసిడెంట్ – II – ఎం.డి హఫిసొద్దీన్ (సీనియర్ అసిస్టెంట్), సెక్రటరీ – టి.శివరంజని (సీనియర్ అసిస్టెంట్), జాయింట్ సెక్రటరీ (మహిళ) – కె .కవిత (సూపరింటెండెంట్), జాయింట్ సెక్రటరీ -1 – బి. శ్యామ్ కుమార్ (సూపరింటెండెంట్), ట్రెజరర్ – కె .సంకీర్త్ రెడ్డి (సీనియర్ అసిస్టెంట్), ఆర్గనైజింగ్ సెక్రటరీ – కె .శివకుమార్ (సీనియర్ అసిస్టెంట్), పబ్లిసిటీ సెక్రటరీ – సుధీర్ (సీనియర్ అసిస్టెంట్), క్రీడల కార్యదర్శి – ముఖేష్ (సీనియర్ అసిస్టెంట్), సాంస్కృతిక కార్యదర్శి – పి.సతీష్ (సీనియర్ అసిస్టెంట్), ఈ.సి. మెంబర్ – పి. వెంకటేష్ (సీనియర్ అసిస్టెంట్), ఈ.సి. మెంబర్ – ఎ .విక్రమ్ రాజ్ (సీనియర్ అసిస్టెంట్), ఈ.సి. మెంబర్ – పి. నరేంద్ర కుమార్ (సీనియర్ అసిస్టెంట్).
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





