పాలమూరు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు కావాలి

-‌ నీళ్లు-నిజాలు’ అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌పీపీటీ
– రూ.27వేల కోట్లు ఖర్చే చేశామన్న బిఆర్‌ఎస్‌ ‌తట్టెడు మట్టి ఎత్తలే
– కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌, ‌తదితరులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జనవరి 1: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చెప్పిందన్నారు. నీటి వాటాలపై అసెంబ్లీలో శుక్రవారం చర్చ జరగనున్న దృష్ట్యా నీళ్లు-నిజాలు అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం మంత్రి ఉత్తమ్‌ ‌పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ‌పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇతరపథకాలపై ఉత్తమ్‌ ‌వివరణ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.80 వేల కోట్లకుపైగా కావాలి. రూ.80వేల కోట్ల ప్రాజెక్టుపై రూ.27వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? మేం వచ్చాక రూ.7 వేల కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం త్టటెడు మట్టి తీయలేదని ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని ఉత్తమ్‌ ‌మండిపడ్డారు.

అసెంబ్లీలో మేమూ పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ఇస్తాం: ‌కెటిఆర్‌

నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రభుత్వం పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇవ్వాలనుకుంటే బీఅర్‌ఎస్‌కు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. సభలో సమాన హక్కులు ఇవ్వాలని, పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌కు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. తాము మీ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి.. చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్‌ ‌చేయాలో నేర్పిస్తారా అన్నారు. మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా. సుంకిశాల ఎలా కూల్చామో చూపిస్తారా. వ్టటెం పంప్‌ ‌హౌస్‌ ఎలా ముంచామో వివరిస్తారా. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులన్నింటినీ కేఆర్‌ఎం‌బీకి ఎలా ధారాదత్తం చేశారో చెప్పబోతున్నారా. రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు అందించిందా అని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఒక్క చెరువునూ బాగు చేయలేదని, ఒక్క కాలువనూ మరమ్మ  చేయలేదని విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *