కాళేశ్వరం కోసం రూ.84వేల కోట్ల అప్పు

– తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు
– రాజకీయాలకు తావు లేకుండా విచారణ
– జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌ కేమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. మేడిగడ్డకు మార్చారని చెప్పారు. భారీగా తెచ్చిన అప్పులతో చేపట్టిన కాళేశ్వరం బీఆర్‌ఎస్‌ హయాంలోనే కూలిపోయిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌పై న్యాయ విచారణ చేయిస్తామని గతంలోనే హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో న్యాయ విచారణ చేపట్టామని, రాజకీయ అంశాలు జోడిరచకుండా విచారణ జరపాలని కోరామని చెప్పారు. 660 పేజీలతో నివేదికను కమిషన్‌ నీటిపారుదల శాఖకు ఇవ్వగా ఆ నివేదికను ముగ్గురు అధికారుల కమిటీ 25 పేజీలతో సంక్షిప్తం చేసిందన్నారు. 2016లో మేడిగడ్డ ప్రాజెక్టు అగ్రిమెంట్‌ జరగగా 2019లో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2023లో మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంతో దాని కుంగుబాటుపై నేషనల్‌ డ్యామ్‌ సేప్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్‌, డిజైన్‌లో లోపాలున్నాయని తేలిందని చెప్పారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులోనూ ఇదే సమస్య ఉందని కమిటీ వెల్లడిరచిందని, మూడు బ్యారేజీల్లో నీటి నిల్వకు అవకాశం లేదని తెలిపిందని మంత్రి ఉత్తవమ్‌ చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవన్న కేసీఆర్‌ నిర్ణయం నిజాయతీతో కూడిరది కాదని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీ పేర్కొందన్నారు. అక్కడ తగినంత నీరు ఉందని అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారు.. 70శాతం నికర నీటి లభ్యత ఆధారంగా హైడ్రాలజీ క్లియరెన్స్‌ ఇచ్చినట్లు కేంద్రం లేఖ రాసింది.. కేంద్రం నిర్ణయాన్ని కాదని నీటి లభ్యత లేదని గత ప్రభుత్వం లేఖ రాయగా ఆ లేఖ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని అర్థం అవుతోంది.. కేసీఆర్‌ వేసిన నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దని చెప్పి ప్రాణహిత వద్ద బ్యారేజ్‌ కట్టొచ్చని సూచించింది.. ఆ నివేదికను పక్కనపెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఫణంగా పెట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజ్‌ కట్టాలని నిర్ణయించారు.. ప్రాజెక్టుపై అప్పటి కేబినెట్‌ భేటీలో చర్చించలేదు.. సీఎం నోటిమాట మేరకు కాంట్రాక్టులు ఇచ్చారు. ప్రజాధనం కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు విలువలను రివైజ్‌ చేశారు.. మేడిగడ్డ నిర్మాణంపై అప్పటి నీటిపారుదల మంత్రి నిర్ణయం చట్టబద్ధం కాదు. మేడిగడ్డ నిర్మాణానికి ఇచ్చిన జీవోను కేబినెట్‌ సమావేశంలో పెట్టలేదు.. ఇంతపెద్ద ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం అవసరం.. తప్పనిసరి కూడా.. కేబినెట్‌ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయకూడదు. మేడిగడ్డ నిర్మాణానికి ఇచ్చిన జీవోలు 230, 231, నిర్మాణ అనుమతులు చట్ట వ్యతిరేకం. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ అన్నింటికీ కేసీఆర్‌ వ్యక్తిగతంగా బాధ్యుడని కమిటీ పేర్కొంది‘ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *