పత్తి అమ్మకాలు సీసీఐ వద్దే జరగాలి

– అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: రైతులు దళారులు దగ్గర మోసపోకుండా సీసీఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంటల కొనుగోళ్లపై, తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పత్తిలో తేమ శాతం తగ్గించి సరైన గిట్టుబాటు ధర (ఎంఎస్‌పీ) పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పత్తిలో తేమ శాతం పరీక్షించే పరికరాలు అందుబాటులో ఉంచాలని, మార్కెట్‌ యార్డులలో సరిపడా యంత్రాలు, పరికరాలు, సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో పత్తి సేకరణలో సీసీఐ నిబంధనలలో 8-12% తేమ శాతం సడలించాల్సిందిగా ఆ శాఖ అధికారులను ప్రభుత్వం కోరింది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేసే యంత్ర పరికరాలకు ఒక ఇన్వెంటరీని నిర్వహించాలని, వాటిని క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయిసూ సీజన్‌లో రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ-నావమ్‌ సర్వర్‌లో ఏర్పడుతున్న సమస్య మూలంగా కొన్ని జిల్లాల్లో రైతులు ఇబ్బందిపడ్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సంవత్సరం సీసీఐ ప్రవేశపెట్టిన మ్యాపింగ్‌ విధానం వల్ల పత్తి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఎల్‌-1, ఎల్‌-2 విధానంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే సీసీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ వారం రైతు నేస్తంలో పత్తి పండిరచే రైతులకి పత్తి కొనుగోళ్లపై మరోసారి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నోడల్‌ ఆఫీసర్స్‌ నిరంతరం పంటల కొనుగోళ్లు పర్యవేక్షించాలన్నారు.
కాగా, పీఎస్‌ఎస్‌లో లేని మొక్కజొన్క, సోయా చిక్కుడు, పెసర కొనుగోళ్లకు కేంద్రం నుంచి అనుమతులు రాని పక్షంలో మరోసారి ఈ విషయం కేంద్ర అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించ ఆరు. మొక్కజొన్న పంటను కేంద్రం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా కూడా రూ.2400 కోట్ల నిధులతో మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నదని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ఎంఎస్‌పీ అమలు చేయకపోవడంతో సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు తమ పంటను తెలంగాణ మార్కెట్లలో అమ్మడం వల్ల స్థానిక రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేరే ఏ ఇతర రాష్ట్రాలలో మన ప్రభుత్వం చేపట్టినట్లు మద్ధతు ధరకు మొక్కజొన్న పంట సేకరణ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి ఆ పంట ఇక్కడకు వచ్చే అవకాశం ఉందన్నారు.. ఎవరైనా అలా తీసుకొచ్చి అమ్మాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తుమ్మల ఆదేశించారు. గత సీజన్‌లో జరిగిన పొరపాట్లను పునరావృతం కానీయొద్దన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, మార్క్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *