దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల  

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో ఉన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల న‌డుమ‌ దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై దాడుల నేపథ్యంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆయ‌న‌ పెద్ద అల్లుడు డాక్టర్ శేఖర్ ఇటీవల దుబాయ్‌లో వైద్యుల కాన్ఫరెన్స్ మీటింగ్ కు వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఆయన తిరుగు ప్రయాణం కోసం ఎయిర్‌పోర్ట్‌ కు వచ్చారు. ఒక్కసారిగా ఆయన అస్వస్థత‌కు గురికావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ స్ట్రోక్ కావడంతో అక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. దీంతో ఐదు రోజుల క్రితం కుటుంబ సభ్యులలో కలిసి మంత్రి తుమ్మల దుబాయ్‌ వెళ్లారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌ లో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ అక్కడే ఉండాల్సి వ‌చ్చింది. మంత్రి సేఫ్ లొకేషన్‌లోనే ఉన్నా తిరిగి రావడానికి ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్ వ‌ర‌కు వేచి ఉండక తప్పదు. కాగా, తాను సురక్షితంగానే ఉన్నానని మంత్రి తుమ్మ‌ల‌ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *